తెలంగాణ

telangana

ETV Bharat / state

Ponnala: ప్రధాని.. దేశ ప్రతిష్ఠను మసకబార్చారు: పొన్నాల లక్ష్మయ్య - నోట్ల రద్దు

ప్రధాని మోదీ.. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను మసకబారేటట్లు చేశారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కరోనా కట్టడిలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. భాజపా.. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అమ్మకాలకు పెడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ponnala criticized pm modi
పొన్నాల లక్ష్మయ్య

By

Published : May 31, 2021, 7:49 PM IST

భాజపా ప్రభుత్వం అప్పులు ఎగ్గొడుతోన్న కార్పొరేట్లను అందలం ఎక్కిస్తూ.. దేశ ఆర్థిక పరస్థితిని మరింత దిగజార్చుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అమ్మకాలకు పెడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.

ప్రధాని.. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను మసకబారేటట్లు చేశారని పొన్నాల విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఉద్యమం కొనసాగుతోన్న.. మోదీ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భాజపా నేతలు.. మతం రంగుతో రాజకీయ పబ్బం గడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. దేశంలో.. నోట్ల రద్దు, జీఎస్టీలతో లక్షలాది పరిశ్రమలు మూతపడి కోట్లాది ఉద్యోగాలు గాలిలో దీపాలుగా మారాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే భాజపా బలోపేతం'

ABOUT THE AUTHOR

...view details