దేశరక్షణకై శ్రమిస్తున్న వీరజవాన్ల మనోబల సంవర్ధనకై హైదరాబాద్లో భగవద్గీత సామూహిక పారాయణ యజ్ఞం ఘనంగా జరిగింది. సంస్కృత భారతి తెలంగాణ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో లిబర్టీ టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వీరజవాన్ల కోసం.. 2 వేల మంది భగవద్గీత పారాయణం
దేశ రక్షణకోసం శ్రమిస్తున్న వీరజవాన్ల కోసం భగవద్గీత పారాయణం చేశారు. 2 వేల మంది భక్తులు ఈ సంకల్పంలో పాలుపంచుకున్నారు.
వీరజవాన్ల కోసం.. 2 వేల మంది భగవద్గీత పారాయణం
ఈ యజ్ఞంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 2 వేల మంది భక్తులు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పగలు రాత్రి దేశాన్ని రక్షించే వీర సైనికులకు దైవిక, నైతిక బలాన్ని అందించడానికి.. భగవద్గీత యొక్క అన్ని అధ్యాయలు సామూహిక పారాయనం పాటించినట్లు సంస్కృత భారతి నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి : ఆన్లైన్ ఆఫర్లే గాలం... మార్కెట్లోకి సరికొత్త సైబర్మోసం!