సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికి కొత్తవి నిర్మించడం ప్రజాధనం వృథా చేయడమే అవుతుందని అఖిలపక్షం నేతలు విమర్శించారు. సచివాలయ ముట్టడిలో భాగంగా ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవాలనే ఆలోచనే సీఎంకు లేదని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ పేర్కొన్నారు. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి అన్ని నిర్మాణాలపై తనపేరు ఉండాలనే ఉద్దేశంతోనే ఈవిధంగా వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామిక తెలంగాణ నేత వివేక్ ఆరోపించారు. తుగ్లక్కు వచ్చిన ఆలోచనలు అన్ని కేసీఆర్కు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలతో పాటు, తరలింపు ప్రక్రియను తక్షణమే మానుకోవాలని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు.
'సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు చేపట్టడం ప్రభుత్వ మూర్ఖత్వమే'
సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల పేరుమీద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే... చూస్తూ ఊరుకోబోమని అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మెుదటగా ప్రజల అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
all party leaders