హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రీజెన్సీ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఆహారోత్సవం ఏర్పాటు చేశారు. దావత్ ఈ లజీజ్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో శాఖాహార, మాంసాహార వంటకాలతో పాటు కబాబ్స్, స్ట్రీట్ ఫుడ్‌ను ఏర్పాటు చేశారు. పుస్తకాల్లో నేర్చుకున్నది, స్వయంగా తయారు చేయడం గొప్ప అనుభూతిని కలిగించిందని విద్యార్థులు వెల్లడించారు. విద్యార్థులకు చదువుతో పాటు స్వీయ అనుభవం రావాలనే ఈ ఆహారోత్సవం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం వల్ల తమలో సరికొత్త ఉత్సాహం కలుగుతుందని విద్యార్థులు అంటున్నారు.
'దావత్ ఈ లజీజ్' పేరుతో ఆహారోత్సవం - Food_Festiveal In Hyderabad
ఆహారోత్సవం అంటే పలు రకాలైన శాఖాహార, మాంసాహార వంటకాలు సహజంగా మనకు కనిపిస్తాయి. కానీ రీజెన్సీ విద్యార్థులు ఆహారోత్సవాన్ని వినూత్నంగా ఏర్పాటు చేశారు. ఒకవైపు రాయల్ పుడ్... మరో వైపు స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇవి భోజన ప్రియులకు నోరూరిస్తున్నాయి. భారతీయ పురాతన సంప్రదాయ వంటకాల రుచులను పరిశోధించి...చక్కటి రుచులతో వాటిని తయారు చేసి ఔరా అనిపించారు.
'దావత్ ఈ లజీజ్' పేరుతో ఆహారోత్సవం
TAGGED:
Food_Festiveal In Hyderabad