తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎఫ్​ఎంసీఎల్​ కేసు ప్రధాన నిందితుడు అరెస్టు - bhansilaal

గొలుసుకట్టు సంస్థ ఎఫ్​ఎంసీఎల్​ కేసులో ప్రధాన నిందితుడు భన్సీలాల్​ను సైబరాబాద్​ పోలీసులు హరియాణాలో అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం భన్సీలాల్​ను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరనున్నారు.

ఎఫ్​ఎంసీఎల్​ కేసు ప్రధాని నిందితుడు అరెస్టు

By

Published : Sep 21, 2019, 6:40 AM IST

Updated : Sep 21, 2019, 10:00 AM IST

ఎఫ్​ఎంసీఎల్​ కేసు ప్రధాని నిందితుడు అరెస్టు
గొలుసుకట్టు సంస్థ ఎఫ్ఎంసీఎల్ కేసులో ప్రధాన నిందితుడు భన్సీలాల్​ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హరియాణాలో ఉన్న అతన్ని అరెస్ట్ చేసి పీటీ వారెంట్​పై హైదరాబాద్​కు తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం రిమాండ్​కు తరలించారు. 'ఫ్యూచర్ మేక్ లైఫ్ కేర్' పేరుతో గొలుసుకట్టు వ్యాపారం నిర్వహించి.. దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల కోట్లకు పైగా మోసం చేశారు. వేలాది మందిని మోసం చేసిన ఎఫ్ఎంసీఎల్ నిర్వాహకులపై సైబరాబాద్​లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన సైబాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు ఇప్పటికే సంస్థ డైరెక్టర్లు రాధేశ్యాం, సురేందర్​ను అరెస్ట్ చేశారు.

ప్రత్యేక బృందాలతో..

హరియాణాలోని హిస్సార్ కేంద్రంగా ఫ్యూచర్ మేక్ లైప్ కేర్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థ ఆర్థిక వ్యవహారాలన్నీ భన్సీలాల్ పర్యవేక్షిస్తున్నాడు. ఏడాది కాలంగా పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న బన్సీలాల్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు నిర్వహించారు. ఎట్టకేలకు శుక్రవారం హరియాణాలో పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం భన్సీలాల్​ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా సైబరాబాద్ పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నారు.

ఇదీ చూడండి: 'ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Last Updated : Sep 21, 2019, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details