భారీ వర్షంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలోని లక్ష్మీ నగర్లో ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న నాలా పొంగడంతో భారీ ప్రవాహంతో ఇళ్లలోకి నీరు చేరి జనం ఇక్కట్లు పడుతున్నారు. నిత్యావసర సరకులు పూర్తిగా తడిసిపోవడమే గాక ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు నీటిని తరలించే చర్యలు తీసుకోవడం లేదు
కుండపోత వానతో జంట నగరాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వానకి రహదారులు చెరువులుగా మారడమే గాక ఇళ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ న్యూ కంటోన్మెంట్లో నాలా పొంగడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
అధికారులు నీటిని తరలించే చర్యలు తీసుకోవడం లేదు
ఇళ్లు మునిగిపోయినా ఇప్పటి వరకూ అధికారులు వచ్చి నీటిని తరలించే చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. నీటిని తరలించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజులుగా చిన్న పిల్లలతో ఇంటి బయట బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారుల అవస్థలు