శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన కృష్ణమ్మ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం జలాశయానికి 6లక్షల 23 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. ఔట్ ఫ్లో 6లక్షల 50 వేల క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.40 అడుగుల మేర ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 195.66 టీఎంసీల నీటిమట్టం ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31 వేల 31 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42 వేల 378 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 10 గేట్ల ద్వారా 5లక్షల 43 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద - శ్రీశైలం
శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా అధికంగా ఉన్న వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. నాగార్జునసాగర్‌లోనూ వరద నీరు తగ్గుతోంది. సాగర్ పూర్తి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 301 టీఎంసీల నీరు ఉంది.
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద
నాగార్జునసాగర్‌కు వరద క్రమేపీ తగ్గుతోంది. ఇన్‌ఫ్లో 5లక్షల 25 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 5లక్షల 25 వేలుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586 అడుగుల మేర నీరు ఉంది.
ఇవీ చదవండి..తగ్గుతున్న ప్రవాహం... వరదలోనే పంట పొలాలు