శంషాబాద్ విమానాశ్రయంలో నిన్నటి నుంచి ఇప్పటివరకు మూడు విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యాయి.
సాంకేతిక సమస్యలతో..
సోమవారం ఉదయం 7 గంటలకు శంషాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాల్సిన విమానం రన్ వే పైకి వెళ్ళగానే సాంకేతిక లోపం తలెత్తటంతో నిలిపివేశారు. 4 గంటల పాటు విమానంలోనే ఉన్న తరువాత 285 మంది ప్రయాణికులను నోవాటెల్ హోటల్‌కు తరలించారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు ప్రయాణికులు హోటల్లోనే పడిగాపులు పడుతున్నారు. అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంజన్‌లో లోపంతో..
హైదరాబాద్ నుంచి దిల్లీకి వెళ్తున్న విస్తారా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. గాల్లోకి లేచిన 15 నిమిషాలకు ఎడమ పక్క ఇంజన్‌లో సాంకేతిక లోపంతో గాల్లో చక్కర్లు కొట్టి విమానాశ్రయంలో దిగింది. సురక్షితంగా ల్యాండ్ అవ్వటంతో అందులో ప్రయాణిస్తున్న 128 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అత్యవసర ల్యాండింగ్‌లు..
శంషాబాద్ విమానాశ్రయంలో మూడు విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యాయి. ఇందులో రెండు విమానాలు సాంకేతిక లోపాలతో కిందికి దిగగా.. ఎవరికి ఏమీ కాకపోవటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానాలు
గుండెపోటుతో ప్రయాణికుడు మృతి..
మరో ఘటనలో కోల్కత్తా నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు రావటంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆ వ్యక్తి మృతి చెందాడు.