తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జెండా ఎగురవేశారు. పార్టీ కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.
బోయిన్పల్లిలో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు - trs
సికింద్రాబాద్ బోయిన్పల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీ జెండా ఎగురవేశారు. పార్లమెంట్ ఫలితాల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బోయిన్పల్లిలో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అసెంబ్లీలో గెలిచినట్లుగానే రాబోయే పార్లమెంట్ ఫలితాల్లోనూ 16 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:'రాహుల్ 'దేశద్రోహం కేసు' పిటిషన్పై నివేదిక ఇవ్వండి