హైదరాబాద్ మలక్‌పేట ముసారాంబాగ్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోని నీటి సంపులో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ తన ఇంటి ఎదురుగా ఉన్న నిర్మాణంలో ఉన్న భవనంలోకెళ్లిన రెహమాన్ అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మలక్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. భవన నిర్మాణంలో యాజమానులు, నిర్మాణ సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే కోణంలో విచారిస్తున్నారు. భవన నిర్మాణంలో నిర్మాణ సంస్థ, యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోనందునే బాలుడు మృత్యువాత పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నీటి సంపులో పడి ఐదేళ్ల బాలుడు మృతి - malakpet
హైదరాబాద్ మలక్‌పేటలో విషాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంటులోని నీటి సంపులో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.
నీటి సంపులో పడి ఐదేళ్ల బాలుడు మృతి