తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రపంచ వేదికపై నగర పరిశోధకులు

స్టాన్​ఫర్ట్​ యూనివర్సిటీ టాప్​ 200 ర్యాంకుల్లో హైదరబాద్​ నగరంలోని వివిధ కేంద్ర పరిశోధన సంస్థలకు చెందిన ఐదుగురు పరిశోధకులు నిలిచారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి మరో 15 మంది ప్రొఫెసర్లు చోటు దక్కించుకున్నారు.

Five scientists from Hyderabad in the Stanford versity top 200 ranks
ప్రపంచ వేదికపై నగర పరిశోధకులు

By

Published : Nov 3, 2020, 7:04 AM IST

ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఎంపిక చేసిన భారతీయ శాస్త్రవేత్తల్లో హైదరాబాదీలు సత్తా చాటారు. టాప్‌ 200 ర్యాంకుల్లో నగరంలోని వివిధ కేంద్ర పరిశోధన సంస్థలకు చెందిన ఐదుగురు పరిశోధకులు నిలవగా.. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి మరో 15 మంది ప్రొఫెసర్లు చోటు దక్కించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు చేసిన ప్రయోగాలు, వివిధ అంశాలపై వెలువరించిన పరిశోధన పత్రాలు, దేశ పరిశోధన రంగంలో వాటి ప్రయోజనాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 29వ, దేశంలో 2వ స్థానాన్ని ఐఐసీటీ నుంచి సీనియర్‌ ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త వెంకట మోహన్‌ సాధించారు.

సీసీఎంబీ నుంచి అమితాబ్‌ ఛటోపాధ్యాయ దేశంలో ఆరో ర్యాంకు దక్కించుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి పర్యావరణ శాస్త్ర విభాగంలో విశ్రాంత ఆచార్యులు ఎంఎన్‌వీ ప్రసాద్‌ 116వ ర్యాంకు, న్యూక్లియర్‌ కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌ అశ్విని నంగియా 124వ ర్యాంకు, లిటరరీ స్టడీస్‌ విభాగంలో ప్రొఫెసర్‌ ప్రమోద్‌ కె నాయర్‌ 189వ ర్యాంకుల్ని సాధించారు. సింబియాసిస్‌ విశ్వవిద్యాలయం నుంచి చాన్‌ చోక్‌యో 842వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రవీందర్‌ 1,571 ర్యాంకుల్ని సాధించారు.

ఇవీ చూడండి: ఆర్టీసీ బస్సు సర్వీసులపై తెలంగాణ, ఏపీ మధ్య కుదిరిన ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details