తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ శిశువు బరువు 5.5 కేజీలట!

అప్పుడే పుట్టిన బిడ్డ మూడు కేజీలుండటం సర్వ సాధారణం. నాలుగు కేజీలున్న శిశువునూ మనం చూసే ఉంటాం. కానీ ఏకంగా 5.5 కేజీలుండటం ఆశ్యర్యమే కదా! ఆ వివరాలేంటో చూసేద్దాం...

ఆ శిశువు బరువు 5.5 కేజీలట!

By

Published : Jul 13, 2019, 7:28 PM IST

Updated : Jul 13, 2019, 7:34 PM IST

ఆ శిశువు బరువు 5.5 కేజీలట!

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన ప్రేమ్ కుమార్, పద్మ దంపతులకు ఓ పాప జన్మించింది. అయితే... ఆ పాప బరువు 5.5 కిలోలు. బొద్దుగా ఉన్న ఆ పాపను చూసి అందరూ సంతోషించారు. ఆ తర్వాత పాప బరువు 5.5 కిలోలు అని చెప్పడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. వైద్యులు వచ్చి తల్లీబిడ్డ క్షేమమని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తల్లికి చక్కెర వ్యాధి ఉండటం వల్ల... ఆమె తీసుకున్న ఆహారం శిశువుకు చేరి అధిక బరువుతో పుట్టిందని పిల్లల వైద్య నిపుణుడు మాగంటి శ్రీనివాసరావు తెలిపారు.

ముద్దుగా బొద్దుగా ఉన్న ఆ పాపను చూసి అందరూ గారం చేస్తుంటే... చూసి మురిసిపోవడం ఆ తల్లిదండ్రుల వంతైంది!

ఇవీ చూడండి: వైరల్​: ఆకలితో రెస్టారెంట్​కు వెళ్లిన గజరాజు

Last Updated : Jul 13, 2019, 7:34 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details