గోదావరిలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితం - fisherman
పోలవరం వద్ద దావరిలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితంగా బయట పడ్డారు. నేవీ హెలికాఫ్టర్ ద్వారా సిబ్బంది వారిని ఒడ్డుకు చేర్చారు.
గోదావరిలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితం
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరిలో చిక్కుకుపోయిన మత్స్యకారులు సురక్షితంగా బయట పడ్డారు.వీరవరపులంక సమీపంలోని ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద వారు ఆగిపోయారు. ఉదయం నుంచి ఆహారం లేక ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఎగువ కాఫర్ డ్యామ్ చివరి భాగమైన పోచమ్మ గండి వైపు వచ్చి ఆగిపోయిన మత్స్యకారులను నేవీ హెలికాఫ్టర్ ద్వారా సిబ్బంది రక్షించారు. వీరంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్నారు.