హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో అగ్ని ప్రమాదం సంభవించింది. పేరుకుపోయిన చెత్తకుప్ప నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సందర్శకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. కొన్ని చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రాంగోపాల్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సిగరెట్ తాగి చెత్తకుప్పలో పారేయడం వల్ల జరిగిందా... లేక కావాలని చేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు.
సంజీవయ్య పార్కులో అగ్నిప్రమాదం - అగ్నిప్రమాదం
పేరుకుపోయిన చెత్త నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడం హైదరాబాద్ సంజీవయ్య పార్కులో కలకలం రేపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నిప్రమాదం