హైదరాబాద్ సనత్‌నగర్ ఠాణా పరిధిలోని అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసి పడడం వల్ల స్థానికులు, కార్మికులు భయాందోళనకు గురయ్యారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ప్లాస్టిక్ సామాను దగ్దమైంది. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
సనత్‌నగర్‌లోని అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం - sanathnagar
సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇండస్ట్రీయల్ ఏరియాలోని అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్లాస్టిక్ సామాను దగ్దమైంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడం వల్ల భారీ ముప్పు తప్పింది.
స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం