తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు అతలాకుతలమైన ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. పది వేల ఆర్థిక సహాయం అందించేందుకు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా బన్సీలాల్పేటలో వరద బాధితులకు తెరాస పార్టీ ఇన్ఛార్జి గుర్రం పవన్కుమార్గౌడ్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
బన్సీలాల్పేటలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత
భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ. పది వేల ఆర్థిక సహాయాన్ని రంగారెడ్డి జిల్లా బన్సీలాల్పేటలో తెరాస పార్టీ ఇన్ఛార్జి గుర్రం పవన్కుమార్గౌడ్ అందించారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందని కుటుంబాలను వీలైనంత త్వరగా ఆదుకుంటామని పవన్ వివరించారు.
బన్సీలాల్పేటలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత
వరద ముంపునకు గురైన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రూ. 550 కోట్లను యుద్ధప్రాతిపదికన విడుదల చేసిందని పవన్కుమార్గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందని కుటుంబాలు ఇంకా ఉన్నాయని.. వాటిని గుర్తించి వీలైనంత త్వరగా ఆదుకుంటామని ఆయన వివరించారు.