దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రగతిభవన్ ముట్టడికి ఇచ్చిన పిలుపును పోలీసులు భగ్నం చేశారు. కొవిడ్ నేపథ్యంలో తమను ఉద్యోగాల నుంచి తొలగించిన ప్రభుత్వం... తక్షణమే విధుల్లోకి తీసుకుని వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రాకుండా అడ్డుకున్నారు.
ప్రగతిభవన్ ముట్టడికి యత్నం... ఫీల్డ్ అసిస్టెంట్ల అరెస్ట్ - telangana varthalu
సమస్యలు పరిష్కరించాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించగా ... పోలీసులు భగ్నం చేశారు. పంజాగుట్ట వద్ద 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రగతిభవన్ ముట్టడికి యత్నం... ఫీల్డ్ అసిస్టెంట్ల అరెస్ట్
ప్రగతి భవన్ వైపు వస్తుండగా పంజాగుట్ట వద్ద 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి నగరంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు.
ఇదీ చదవండి: జానారెడ్డి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు: మంత్రి ఎర్రబెల్లి