రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున విష జ్వరాల బారిన పడుతున్నారు. దీనితో గాంధీ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే ఇన్ పేషంట్లు రెండింతలు పెరిగిపోయారు. పెరిగిన రోగులకు అనుగుణంగా ఆసుపత్రిలో బెడ్లు లేకపోవడం వల్ల నేలమీదే చికిత్స చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి విషజ్వరాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ మరిన్నీ వివరాలు అందిస్తారు.
విజృంభిస్తున్న విషజ్వరాలు... నేలపైనే రోగులకు చికిత్స
రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి. ఇప్పటికే డెంగీ వంటి జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగులకు సరిపడా బెడ్లు లేక నేలపైనే చికిత్స అందిస్తున్నారు.
విజృంభిస్తున్న విషజ్వరాలు... నేలపైనే రోగులకు చికిత్స