తెలంగాణ

telangana

ETV Bharat / state

'అన్నం పెట్టేందుకు ముందుకు రండి'

భాగ్యనగరవాసులు ఆకలితో ఉండకూడదని బల్దియా సంకల్పించింది. ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని విస్తృతం చేసి అకలిచావు లేని నగరాన్ని నిర్మించేందుకు అడుగులు వేస్తోంది.

ఫీడ్ ది నీడ్

By

Published : Feb 14, 2019, 7:50 AM IST

Updated : Feb 14, 2019, 9:32 AM IST

ఫీడ్ ది నీడ్
జీహెచ్ఎంసీ ప్రవేశపెడుతున్న ఫీడ్ ద నీడ్ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11:30 గంటలకు మేయర్ బొంతు రామ్మోహన్.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కోటికి పైగా జ‌నాభా ఉన్న గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో సుమారు మూడు ల‌క్షల మంది ఆహారం ల‌భ్యంకాని వారు ఉంటారని అంచ‌నా వేశారు. వీరంద‌రికీ ఆహారం అందించేందుకు క‌లిసి రావాల్సిందిగా న‌గ‌ర మేయ‌ర్ పిలుపునిచ్చారు.

సీఐఐ హైద‌రాబాద్ శాఖ, హోట‌ల్స్ అసోసియేష‌న్, పిస్తాహౌస్, డీవీ మ‌నోహ‌ర్ హోటల్స్‌, పలువురు వ్యక్తులు ఆహార పొట్లాలు అందించ‌డానికి ముందుకొచ్చారు. రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్‌లు, నైట్ షెల్టర్లు, స్లమ్‌లు, ఆసుప‌త్రులు ఇత‌ర ర‌ద్దీ ప్రాంతాల్లో ఆహారాన్ని అందించ‌డానికి జీహెచ్ఎంసీ ప్రణాళిక‌లు రూపొందించింది. ఆహారాన్ని అందించాల‌నుకునే వారు తమను సంప్రదించాల‌ని కోరింది.
Last Updated : Feb 14, 2019, 9:32 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details