నాన్న మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి.. తనలోని బాధని మనకు తెలియనీయకుండా తనలోనే దాచుకునే బోలా శంకరుడు.. అలాంటి తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడే! మనం ఎగిరే గాలిపటం.. మనల్ని ఎగిరేసిది అమ్మ.. ఆ రెండింటి మధ్య దారం ఉంటుంది. అది కనిపించదు. నాన్న ప్రేమ కూడా అంతే.. దారంలాంటిదే.. చూసేవారికి కనిపించదు!
అమ్మకు ఎదైనా బాధ వస్తే నాన్నకు చెప్పుకుంటుంది. తల్లీకి దుఃఖం వస్తే ఎడుస్తుంది. కానీ నాన్నకు బాధ వస్తే.. దుఃఖం వస్తే.. తన బాధ భార్యాపిల్లలకు చెబితే ఏమవుతారో అని తనలోనే దాచుకునే వ్యక్తి తండ్రి.. మనం గెలిస్తే తను గెలిచినట్లు ఆనందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాన్న మాత్రమే.. ప్రతీ తండ్రి.. తన పిల్లలు తనకన్నా బాగా బతకాలని ఆలోచిస్తుంటాడు. ఆ క్రమంలో మనతో కఠినంగా ఉంటాడే తప్ప మనపై కోపంతో అలా చేయడు.. చిన్నప్పుడు మనం స్కూల్ వెళ్లకుంటే నాన్న.. బెదిరించో, బుజ్జగించో బడికి పంపిస్తాడు. అప్పుడు తండ్రి అంటే భయం, కోపమేస్తుంది. కానీ తర్వాత తెలుస్తోంది. నాన్న ఎందుకు అలా చేశాడో.