ఆడది ఒంటరిగా కనిపిస్తే కాటేసే దాకా వదలని కామాంధులు తిరుగుతున్న కాలమిది. అసలే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అమాయకులు. వయసు లేదు.. వరస లేదు.. రక్తబంధం కూడా మరచి మానవత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు కొందరు మృగాళ్లు. బయట వ్యక్తుల నుంచి మాత్రమే లైంగిక వేధింపులు ఎదుర్కొంటారనుకుంటాం. కానీ ఇటీవల మాత్రం ఏకంగా సొంత వారి నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. ఎవరికి చెప్పుకోవాలో కూడాతెలియక కుమిలిపోతున్నారు.
కన్నకూతురిని అత్యాచారం చేసి చిదిమేసిన తండ్రి - father rapes daughter in chittoor district
22:53 November 02
కన్నకూతురిని అత్యాచారం చేసి చిదిమేసిన తండ్రి
అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినప్పటికి ఎక్కడ కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఆడ పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. తాజాగా అలాంటి ఓ అమానవీయ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. కడుపున పుట్టిన బిడ్డను చిదిమేశాడు.
కామాంధులైన కన్నతండ్రులు అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిని కామపు కోరలతో చూసి అదును చూసి అత్యాచారానికి పాల్పడుతున్నారు.
ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళితే... రేణిగుంటకు చెందిన ఓ వ్యక్తి పద్నాలుగేళ్ల కూతురు పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్టోబర్ 24వ తేదీన బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే ప్రాణాలు తీస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక బాధిత బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఇక తల్లి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TAGGED:
కన్న కూతురిపై అత్యాచారం