తెలంగాణ

telangana

ETV Bharat / state

Family Meet: అరిటాకుల్లో భోజనం.. కుటుంబంతో కలిసి తింటే అదే స్వర్గం

పండగ అంటేనే పల్లెల్లో కొండంత సందడి కనిపిస్తుంది. ఇక సంక్రాంతి అంటే చేప్పేదేముంది.. ప్రతి ఇళ్లూ బంధువులతో కళకళలాడుతుంది. ఈ సందర్భంగా చిన్నాపెద్దా కలిసి ఒకే సారి భోజనాలు చేయడం ఓ మధురానుభూతి. పండగ రోజు తన ఇంటికి పిలిపించుకున్న బంధువులందరికీ ఈ అనుభూతిని మిగల్చాలని తూర్పుగోదావరి జిల్లా చెముడులంక (గాంధీనగరం)కు చెందిన ప్రత్తి సత్యనారాయణ చక్కటి ప్రయత్నం చేశారు. కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు, వారి పిల్లలు, బంధువులు మొత్తం 30 మందిని ఒకే చోట కూర్చోబెట్టి అందరికీ ఒకేసారి అరిటాకుల్లో భోజనం పెట్టారు. ఇన్నాళ్లు ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఇలా పంక్తి భోజనాల్లో కూర్చొని ఎంతో మురిసిపోయారు.

Family Meet
భోజనాలు ఓ మధురానుభూతి

By

Published : Jan 17, 2022, 9:11 AM IST

08:58 January 17

భోజనాలు ఓ మధురానుభూతి

పండగ అంటేనే పల్లెల్లో కొండంత సందడి కనిపిస్తుంది. ఇక సంక్రాంతి అంటే చెప్పేదేముంది.. ప్రతి ఇళ్లూ బంధువులతో కళకళలాడుతుంది. ఈ సందర్భంగా చిన్నాపెద్దా కలిసి ఒకేసారి భోజనాలు చేయడం ఓ మధురానుభూతి. పండగ రోజు తన ఇంటికి పిలిపించుకున్న బంధువులందరికీ ఈ అనుభూతిని మిగల్చాలనుకున్నారు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చెముడులంక (గాంధీనగరం)కు చెందిన ప్రత్తి సత్యనారాయణ.

కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు, వారి పిల్లలు, బంధువులు మొత్తం 30 మందిని ఒకే చోట కూర్చోబెట్టి అందరికీ ఒకేసారి అరిటాకుల్లో భోజనం పెట్టారు. ఇన్నాళ్లు ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఇలా పంక్తి భోజనాల్లో కూర్చొని ఎంతో మురిసిపోయారు.

ఇదీ చదవండి..Chicken And Meat Prices: ముక్క ముట్టాలంటే రూ. వెయ్యి పెట్టాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details