తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫేస్​బుక్​ వల.. 12 లక్షలు స్వాహా

ఓ నైజీరియా యువతి ఫ్రెండ్ షిప్ పేరుతో ఓ జవాన్​కు వల విసిరింది... తాను లండన్​లో ఉంటానని తనకు జవాన్లంటే ఇష్టమని నమ్మబలికింది. హైదరాబాద్​ అంటే అమితమైన ప్రేమని ఇష్టమని చెప్పింది. గిఫ్టులు పంపిస్తూన్ననంటూ నమ్మంచి.. నట్టేట ముంచేసింది.

facebook-trap-in-crpf-jawan-in-hyderabad
ఫేస్​బుక్​ వల.. 12 లక్షలు స్వాహా

By

Published : Mar 29, 2020, 6:19 AM IST

హైదరాబాద్​లోని ఓ సీఆర్​పీఎఫ్ జవాన్​ను నైజీరియాకు చెందిన ఓ యువతి మూడు నెలల క్రితం ఫేస్​బుక్​లో పరిచయం చేసుకుంది. తాను లండన్​లో ఉంటానని, ఓ సంస్థలో మేనేజర్​గా పని చేస్తున్నానని తెలిపింది. హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. సీఆర్​పీఎఫ్​లో ఉద్యోగం చేసేవారంటే మరింత ఇష్టమంది. వాట్సాప్ ద్వారా మాట్లాడుడూ మొదలు పెట్టింది. స్నేహానికి గుర్తుగా బహుమతి రూపంలో ఐ-ఫోన్, ల్యాప్​టాప్, అమెరికన్ డాలర్లు పంపుతున్నానంటూ నమ్మబలికింది. ఆమె మాటలకు జవాను సంతోషించాడు.

ఈ నేపథ్యంలో దిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నామంటూ జనాన్​కు ఫోన్ చేశారు. బహుమతులు ఇంటికి పంపాలంటే సుంకం చెల్లించాలని చెప్పారు. ఆదాయపు పన్ను కట్టాలంటూ కేవలం 15 రోజుల్లో రూ. 12 లక్షలు వసూలు చేశారు. చివరికి బహుమతులు ఇక రావని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరించారు. కోల్​కతా, బీహార్ నగరాల్లోని వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిందని గుర్తించారు. వివరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

ఫేస్​బుక్​ వల.. 12 లక్షలు స్వాహా

ఇదీ చూడండి :బాధ్యతగా కల్లుతాగడమంటే ఇదేనేమో..

ABOUT THE AUTHOR

...view details