తెలంగాణ

telangana

ETV Bharat / state

'పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపుపై వివరణ ఇవ్వండి' - land

రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వంతో పాటు.. వివిధ పార్టీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అభ్యంతరాలపై స్పందించాలని ఆదేశించింది.

'పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపుపై వివరణ ఇవ్వండి'

By

Published : Aug 10, 2019, 7:11 AM IST

Updated : Aug 10, 2019, 8:05 AM IST

జిల్లా కేంద్రాల్లో రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయింపు అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అభ్యంతరాలపై స్పందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు తెరాస, కాంగ్రెస్, భాజపా, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, తెదేపా, వైకాపా, బీఎస్పీలను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జిల్లాల్లో రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణం కోసం స్థలం కేటాయింపుపై గతేడాది ప్రభుత్వం జారీ చేసిన జీవో 167తో పాటు... ఇటీవల తెరాస కార్యాలయాలకు జిల్లాల్లో భూములు కేటాయిస్తూ విడుదల చేసిన జీవో 66 కొట్టివేయాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిగింది. గతంలో 33 ఏళ్ల లీజు పరిమితితో భూకేటాయింపులు జరిగేవని.. అయితే లీజు ప్రస్తావన లేకుండా గతేడాది జీవో విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. చదరపు గజానికి వంద రూపాయలుగా ధర ఖరారు చేయడం చట్టవిరుద్ధమన్నారు. అభ్యంతరాలపై స్పందించాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది.

'పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపుపై వివరణ ఇవ్వండి'
Last Updated : Aug 10, 2019, 8:05 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details