సినీ తారల డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఆ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కౌంటరు అఫిడవిట్‌ను దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మధ్యంతర దరఖాస్తు కొట్టివేయాలని ఎక్సైజ్‌శాఖ హైకోర్టును కోరింది.
Drugs Case:వాంగ్మూలాలు, సాక్ష్యాలన్నింటినీ కోర్టులకు సమర్పించాం: ఎక్సైజ్‌శాఖ - Drugs case
21:27 September 16
Drugs Case:వాంగ్మూలాలు, సాక్ష్యాలన్నింటినీ కోర్టులకు సమర్పించాం: ఎక్సైజ్‌శాఖ
డ్రగ్స్ కేసులపై వివిధ కోర్టుల్లో 12 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది. ఎఫ్ఐఆర్‌లు, రిమాండ్ నివేదికలు, ఛార్జ్‌షీట్లన్నీ ఈడీకి ఇచ్చామని తెలిపింది. ఈడీ కోరుతున్న వాంగ్మూలాలు, డిజిటల్ సాక్ష్యాలు మా వద్ద లేవని ఎక్సైజ్‌శాఖ స్పష్టం చేసింది. వాంగ్మూలాలు, సాక్ష్యాలన్నింటినీ కోర్టులకు సమర్పించామని ఎక్సైజ్‌శాఖ పేర్కొంది.
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే, సినీ ప్రముఖులకు క్లీన్‌చీట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు.. పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. డ్రగ్స్ సరఫరాదారులకు.. సినీ సెలబ్రిటీలకు మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
ఇదీ చూడండి:DRUGS CASE: రేపు ఈడీ విచారణకు హాజరుకానున్న నటుడు తనీష్