తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్ల పరిశీలన'

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా  మహంకాళి ఆలయంలో చేసిన ఏర్పాట్లను నగర అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ పరిశీలించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Jul 17, 2019, 4:35 PM IST

బోనాల ఏర్పాట్ల పరిశీలన'

ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నగర అదనపు పోలీస్​ కమిషనర్​ అనిల్​కుమార్​ అధికారులకు సూచించారు. బోనాల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాంగోపాల్ పేట్ నుంచి బోనాలు తీసుకొచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఆలయ ఈవో అన్నపూర్ణ పాల్గొన్నారు.

'మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఏర్పాట్ల పరిశీలన'
ఇదీ చూడండి: కనకదుర్గమ్మకు 'తెలంగాణ మహంకాళి' బంగారుబోనం

ABOUT THE AUTHOR

...view details