ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ తీవ్రంగా స్పందించారు. ఒక మాజీ సైనికుడిని పట్టుకుని బ్రోకర్ అని దూషించడం తప్పన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేయడం లేదని.. అలాంటి చిల్లర రాజకీయాలు చేసేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు. ఒకరిపై నిందలు వేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలని పేర్కొన్న ఆయన... దేశం కోసం పని చేసిన వారిని అవమానించడం సరికాదన్నారు.
తెరాస ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారింది: రాములు నాయక్ - pcc chief uttam kumar reddy
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం పని చేసిన ఉత్తమ్ లాంటి వారిని అవమానించడం సరికాదన్నారు.
ఉద్యమ సమయంలో ఇంట్లో పెళ్లికి కూడా చెరుకు సుధాకర్ సంకెళ్లతో వచ్చినాడని, ఆయనపై ఉద్యమ సమయంలో పీడీ చట్టం కింద కేసులు పెట్టారని... ఇప్పుడు అదేం పార్టీ అని అనడంలో అర్థం ఏమిటని నిలదీశారు. ఇతర పార్టీల నాయకులను కొనుక్కుంటూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నది మీరు కాదా అని నిలదీశారు. తెరాస పార్టీ ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారిందన్న ఆయన... కేబినెట్‌లో మీ పక్కన ఒక్క మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులైనా ఉన్నారా అని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్