ముఖ్యమంత్రి కేసీఆర్... గత గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్, కేటీఆర్‌లకు గిన్నిస్ బుక్‌లో మొదటి స్థానం ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు.
వంద రోజుల ప్రణాళిక ఏమైంది? లక్ష రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడ? ఉచిత ఇంటర్నెట్ ఏది? ఎంబీసీలకు కార్పోరేషన్ ఎక్కడ? పాతబస్తీకి మెట్రో, మూసీ ప్రక్షాళన ఏమైంది?