తెలంగాణ

telangana

ETV Bharat / state

సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా: ఏబీ వెంకటేశ్వరరావు - ఏపీ తాజా వార్తలు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరపాలని మాజీ ఇంటెలిజెన్స్‌ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా: ఏబీ వెంకటేశ్వరరావు
సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా: ఏబీ వెంకటేశ్వరరావు

By

Published : Apr 10, 2021, 2:37 PM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని... ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాశారు. అభియోగాలపై విచారణకు సంబంధించి 9 పేజీల లేఖ రాశారు.

ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఆధారాలను జతచేశానని... కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణలో నకిలీ పత్రాలు సమర్పించారని వెల్లడించారు. సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details