వర్షపు నీటిని పొదుపు చేయాలని సీఐఎస్ఎఫ్ (ఎన్ఎఫ్సీ) యూనిట్ జవాన్లు ఇసీఐఎల్లో ర్యాలీ నిర్వహించారు. సమస్త ప్రాణకోటికి నీరే ప్రాణాధారమని, నీరు ఎక్కడ ఉంటే అక్కడే ఆహ్లాదం వెల్లివిరుస్తుందని జవాన్లు తెలిపారు.
అభివృద్ధి విస్తరణకు నీరే ప్రధానమని స్పష్టం చేశారు. జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోందని వివరించారు. జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని గుర్తు చేశారు. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే జల శక్తి అభియాన్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని..నీటి సంరక్షణ కోసం అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
'నీటి సంరక్షణకు అందరూ కృషి చేయాలి' - పెరుగుతున్న జనాభా
వాన నీటిని ప్రజలంతా సంరక్షించాలని ఇసీఐఎల్లో ఎన్ఎఫ్సీ యూనిట్ జవాన్లు అవగాహన కార్యక్రమం చేపట్టారు. అందరూ జల శక్తి అభిమాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
జల వనరులను ప్రతీ ఒక్కరూ సంరక్షించాలి : జవాన్లు
ఇవీ చూడండి : నిండుకుండను తలపిస్తోన్న హుస్సేన్ సాగర్