ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలునేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. 2022 సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న పది మంది విద్యార్థులకు బంగారు పతకాలు పంపిణీ చేయనున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగంతో పాటు భాజపా రాష్ట్ర శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు కల్పించారు.సర్కారు కొలువే సో బెటరూ..!ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ల నేపథ్యంలో ప్రైవేటురంగంలోని చిరుద్యోగులు సర్కారు కొలువు కలను సాకారం చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వారు ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. దీంతో పలు సంస్థలు సిబ్బంది దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.ఆదాయ మార్గాలపై ప్రభుత్వం కసరత్తు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రుణాలకు అనుమతి కోసం కేంద్రం వద్ద ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఇతర మార్గాల్లో రాబడులను పెంచుకోవడంపై దృష్టి సారించింది. భూముల అమ్మకం సహా ల్యాండ్ పూలింగ్ తదితరాలను వేగవంతం చేస్తోంది.పోలీస్ ప్రాథమిక రాతపరీక్ష ఎప్పుడంటే..!Police Preliminary Examination: రాష్ట్రంలో భారీఎత్తున పోలీస్ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ నియామకాల్లో కీలకమైన ప్రాథమిక రాతపరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సన్నాహాలు చేస్తోంది.యువతికి 'కృత్రిమ' పునరుత్పత్తి అవయవాలు బంగాల్లోని డైమండ్ హార్బర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతికి శస్త్రచికిత్స ద్వారా పునరుత్పత్తి అవయవాలను కృత్రిమంగా సృష్టించి కొత్త జీవితాన్ని ఇచ్చారు.ఉగ్ర కాల్పుల్లో టీవీ నటి మృతి.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. కొన్ని రోజులుగా బరితెగించి బహిరంగంగా ఇళ్లపైనే పడి కాల్పులు జరుపుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. 24గంటల వ్యవధిలోనే కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా బూద్గామ్ జిల్లాలో టీవీ నటి అమ్రీన్ భట్ (35)ను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆమె మేనల్లుడు గాయపడ్డాడు.బంకుల్లో పెట్రోల్ లేదు.. ఏటీఎంలలో డబ్బులు లేవు! Pakistan No Petrol: పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితుల గురించి పేర్కొంటూ ఆ దేశ మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బంకుల్లో పెట్రోల్ లేదని, ఏటీఎంలలో నగదు అందుబాటులో లేదని అన్నారు.గ్రెటా ఎలక్ట్రిక్ కొత్త విద్యుత్ స్కూటర్.. Greta Electric Scooters: సరికొత్త విద్యుత్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంస్థ. బ్యాటరీ, ఛార్జర్‌లను విడిగా అమ్మకానికి పెట్టింది. వీటి ధరలు ఎలా ఉన్నాయంటే..ఉమ్రాన్ భవిష్యత్ అతడి చేతుల్లోనే ఉంది: గంగూలీ Umran Malik: ఉమ్రాన్ మాలిక్ భవిష్యత్ అతడి చేతుల్లోనే ఉందన్నాడు సౌరభ్ గంగూలీ. ఇదే వేగంతో బౌలింగ్ చేస్తే కచ్చితంగా సుదీర్ఘ కాలంపాటు టీమ్‌ఇండియాకు ఆడతాడనే నమ్మకం తనకుందని చెప్పాడు.నాని.. మొన్న మహేశ్‌తో.. ఇప్పుడు ఎన్టీఆర్‌తోనా!హీరోలు మహేశ్‌బాబు, ఎన్టీఆర్ సినిమాల్లో నాని ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్‌మీడియా ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.