1.కట్టడి ఎలా..!
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష చేపట్టారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సేవ చేయండి..
కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా... సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలన్న కోర్టు...6 నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గ్రీన్ సిగ్నల్
ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కీచక తండ్రికి జీవిత ఖైదు
హైదరాబాద్‌లో కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. పోక్సో చట్టం కింద బాలిక తండ్రికి కోర్టు శిక్షను ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.అంతా 'షా'నే చేశారు..
బంగాల్‌లో ఓటర్లను సీఆర్పీఎఫ్ సిబ్బంది వేధిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.