1. ఓ వ్యక్తి కిరాతకం
కుటుంబ కలహాలతోనే ఓ వ్యక్తి భార్య, కుమార్తెను కిరాతకంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. కుటుంబ కలహాలతో... భార్య, కుమార్తెను రాడ్డుతో కొట్టి వెంకటేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రాష్ట్రంలో మరో 226 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 226 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,621 మంది కొవిడ్ బాధితులున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు పచ్చజెండా
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఏపీ ఎస్‌ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను నాయస్థానం అనుమతించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 80 శాతం మంది రెడీ..
భారత్‌లో 80 శాతం మంది ప్రజలు టీకా స్వీకరించేందుకు మొగ్గుచూపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. విడుదలైన వెంటనే టీకాను తీసుకుంటామని సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తెలిపారు. మరో ఏడాది లోపు వ్యాక్సిన్ స్వీకరిస్తామని 29శాతం మంది పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బైడెన్ ప్రమాణం రోజున..
అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం రోజున అలబామాలో ఓ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తమపై నిందితుడు కాల్పులకు పాల్పడడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.