వీడుతున్న మిస్టరీ
వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట బావిలో మృతదేహాలపై ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతుంది. ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వివరాలు బయటపడుతున్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఇవాళ 9మృతదేహాలకు శవపరీక్ష పూర్తయింది. బతికుండగానే బావిలోకి నెట్టి చంపారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమ్మకానికి స్వామి వారి ఆస్తులు
తమిళనాడులోని శ్రీవారి స్థిరాస్తులను విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తమిళనాట 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా అమ్మాలని ఆదేశాలు జారీచేసింది. ఎప్పుడు తీర్మానం చేశారంటే...
కాంగ్రెస్ చేయూత
నల్గొండ జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 30 మంది వలస కార్మికులు స్వరాష్ట్రానికి బయలుదేరారు. కార్మికులు కోసం ఏర్పాటు చేసిన బస్సును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రాణం తీసిన మొబైల్ ఛార్జర్
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పదేళ్ల కూతురును మొబైల్ ఛార్జర్ బలితీసుకుంటుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. చరవాణికి ఛార్జింగ్ పెట్టమని ఇవ్వగా... విద్యుత్ షాక్ తగిలి బాలిక మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారంలో జరిగింది. అసలేమైందంటే...
నక్సల్ కమాండర్ హతం
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఇందులో ఒక వ్యక్తి తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.