తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela Rajender Speech in Assembly 2023 : 'ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోందే కానీ.. అమలు చేయట్లేదు'

Etela Rajender Speech in Assembly 2023 : శాసన సభలో విద్యా, వైద్య రంగంలో ఉన్న విషయాల గురించి హూజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ లేవనెత్తారు. ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజులను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కంటింజెంట్‌ సిబ్బందికి కనీసం రూ.10వేలు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

Etela Speech on Hospitals
Etela Rajender speech on universities

By

Published : Aug 4, 2023, 7:52 PM IST

Etela Rajender Speech : ప్రైవేట్​ స్కూళ్లలో ఫీజులు నియంత్రించాలన్న ఈటల రాజేందర్​

Etela Rajender Speech on Education and Health Department: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో హూజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ విద్యా, వైద్యా రంగాల విషయంలో పలు అంశాలను శాసనసభలో లేవనెత్తారు. వైద్య శాఖకు కేటాయించిన బడ్జెట్​ను పూర్తిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు. విద్యా సంస్థల్లో ఇన్​ఛార్జిలను కాకుండా పూర్తిస్థాయి అధికారులను నియమించాలని ఆదేశించారు.

Etela Rajender Speech on Health Department: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలు, వసతులను పెంచాలని అన్నారు. ఏఎన్‌ఎంలు అందరికీ సమాన వేతనం ఇవ్వాలని చెప్పారు. వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ పెంచాలని తెలిపారు. కంటింజెంట్‌ సిబ్బందికి కనీసం రూ.10వేలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. వైద్యశాఖకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయాలని అన్నారు. అప్‌గ్రేడ్‌ చేసిన ఆస్పత్రులకు వైద్య సిబ్బందిని కేటాయించ లేదని ఆరోపించారు. వాటికి అదనంగా రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం బడ్జెట్​ ఇస్తామని ఘనంగా ప్రకటిస్తోంది కానీ.. అమలు చేయటం లేదని ఆరోపించారు.

KTR on Telangana IT Development : 'తెలంగాణ వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలొచ్చాయి'

Etela Rajender Speech on Education Department: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉందని.. అటెండర్లు లేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ దాదాపు 30 లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజులను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేజీబీవీల్లోని బోధన, బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కోరారు. సదురు పాఠశాల సిబ్బందిని చాలా రాష్ట్రాల్లో క్రమబద్ధీకరించారని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో కేజీబీవీ సిబ్బందికి రూ.30 వేలకు పైగా వేతనం ఇస్తున్నారని అన్నారు.

Etela Rajender Speech in Assembly 2023 : రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఇన్‌ఛార్జ్​లను కాకుండా పూర్తిస్థాయి అధికారులను నియమించాలని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిర్వీర్యం అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రముఖ విద్యా సంస్థ ఉస్మానియా వర్సిటీ 18 ర్యాంకులు కోల్పోయిందని గుర్తు చేశారు. పేద విద్యార్థులు ఉంటున్న ప్రభుత్వ వర్సిటీల్లో కొత్త హాస్టళ్లు నిర్మించాలని చెప్పారు. జూనియర్‌ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లను ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయాలని తెలిపారు. జూనియర్‌ లెక్చరర్లకు 12 నెలలకు వేతనం చెల్లించాలని సభలో పేర్కొన్నారు. దీంతో పాటు అన్ని శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు ప్రతి నెలా చెల్లించాలని చెప్పారు.

"కంటింజెంట్‌ సిబ్బందికి కనీసం రూ.10వేలు చెల్లించాలి. వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ పెంచాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలు, వసతులను పెంచాలి. ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోంది కానీ.. అమలు చేయటం లేదు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు లేని దుస్థితి ఉంది. కేజీబీవీల్లోని బోధన, బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించాలి. అన్ని శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు ప్రతి నెలా చెల్లించాలి." - ఈటల రాజేందర్​, హూజూరాబాద్​ ఎమ్మెల్యే

Prashanth Reddy on Crop Compensation : 'పంట నష్టం నివేదిక రాగానే.. ముంపు రైతులందరికీ పరిహారం అందిస్తాం'

Niranjan Reddy on Telangana Crop Loss : 'త్వరలోనే రాష్ట్రంలో.. ప్రత్యేక పంట బీమా పథకం'

ABOUT THE AUTHOR

...view details