తెలంగాణ

telangana

ETV Bharat / state

భూదందాకు రూపకర్త, సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆరే: ఈటల - పోలీసులపై ఈటల ఆగ్రహం

Etela Rajender Fire on CM Kcr: సీఎం కేసీఆర్‌పై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. భూప్రక్షాళన పేరుతో కోట్ల రూపాయల విలువైన భూములు కొట్టేస్తున్నారని ఆరోపించారు. ధరణి విఫలమైందని ఒప్పుకుని కేసీఆర్... సీఎం పదవికి రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు.

etela rajender
etela rajender

By

Published : Sep 20, 2022, 9:26 PM IST

Etela Rajender Fire on CM Kcr: భూప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కోట్ల రూపాయల విలువైన... వేల ఎకరాలు కొట్టేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ధరణిలో నమోదైన భూముల రిజిస్ట్రేషన్లు, క్రయ, విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూ సమస్యల వల్ల అనేకమంది రైతులు న్యాయస్థానం మెట్లు ఎక్కుతుంటే... ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

''భూదందాకు రూపకర్త, సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆరే. భూప్రక్షాళన పేరిట ప్రభుత్వ పెద్దలు వేల ఎకరాలు కొట్టేస్తున్నారు. ధరణి భూముల రిజిస్ట్రేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. భూక్రయ,విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలను వేధించే హక్కు కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు? దేశంలో భూములన్నీ ఎన్‌ఐసీలో భద్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 4సంస్థలు మార్చారు.'' - ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే

భూసమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూసమస్యలతో ఎందరో కోర్టుల మెట్లు ఎక్కుతున్నారని వివరించారు. ఇప్పటికైనా ధరణి విఫలమైందని ఒప్పుకుని కేసీఆర్... సీఎం పదవికి రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు.

'కేసీఆర్.. అది విఫలమైందని ఒప్పుకుని సీఎం పదవికి రాజీనామా చేయ్'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details