Etela Rajender visit EX MP Chandrasekhar House : మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్‌తో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. చంద్రశేఖర్ పార్టీ వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన ఈటల.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. బీజేపీలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించారు. పార్టీలో చేరి రెండున్నర ఏళ్లు అయినా ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామని.. వారికి ఉమ్మడిగా ఎజెండా ఉందని ఈటల రాజేందర్ అన్నారు. ఏ, బీ, సీ, డీ వర్గీకరణకు బీజేపీ కమిట్మెంట్తో ఉందన్నారు. కర్ణాటకలో హామీ ఇచ్చామని.. తెలంగాణలో కూడా వర్గీకరణకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించడంలో కలిసి పనిచేస్తామని అన్నారు.
Chandrasekhar Speech after Meet Etela: పార్టీ వీడుతారని మీడియా విషప్రచారం చేస్తోందన్నారు. వరంగల్ ప్రాంతం వరకే మోదీ మీటింగ్జరిగిందని స్పష్టం చేశారు. అందుకే చంద్రశేఖర్‌కి మోదీని కలిసేందుకు పాస్ రాలేదని తెలిపారు. అంతే తప్ప మరొక అంశం ఇందులో ఇమిడి లేదని అన్నారు. పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనే ఈ భేటీలో చర్చ చేశామని.. మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పారు. ఈటల రాజేందర్ తనకి ఏమి చెప్పలేదని.. తాను పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఈటలకు చెప్పానన్నారు. తెలంగాణ అభివృద్ధి చేయాలనే అంశాలపైనే చర్చించామని తెలిపారు.