తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఈటల జమున పిటిషన్ - హైదరాబాద్ తాజా వార్తలు

ETELA JAMUNA: ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ మాసాయిపేట రెవెన్యూ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఈటల జమున, ఈటల నితిన్ హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమేదో.. ప్రైవేట్ భూములేవో తెలియకుండా నోటీసులు ఇస్తున్నారని ఆమె తరపు న్యాయవాది డి.ప్రకాష్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు.

ఈటల జమున
ఈటల జమున

By

Published : Jul 1, 2022, 11:00 PM IST

ETELA JAMUNA: ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ మాసాయిపేట రెవెన్యూ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఈటల జమున, ఈటల నితిన్ హైకోర్టును ఆశ్రయించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని సర్వే నెంబరు 130లోని మూడెకరాలను సత్యనారాయణ రావు నుంచి ఈటల నితిన్ రెడ్డి కొనుగోలు చేశారని న్యాయవాది డి.ప్రకాష్ రెడ్డి వాదించారు. ఆ భూములను 1995లోనే ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిందని.. అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం తరఫున న్యాయవాది హరీందర్ కోర్టుకు తెలిపారు.

రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమేదో.. ప్రైవేట్ భూములేవో తెలియకుండా నోటీసులు ఇస్తున్నారని.. జమునా హేచరీస్​కు ఇప్పటి వరకు 76 నోటీసులు ఇచ్చారని ప్రకాష్ రెడ్డి వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details