వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు చేరిన కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో ఫోన్లో చర్చించి.. కలెక్టర్లకు సూచించారు. లాక్డౌన్ ద్వారా ఉపాధి కోల్పోయిన పేద ఎస్సీ, ఎస్టీలు కమిషన్కు విజ్ఞాపనలు చేసుకున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఉపాధి కోల్పోయిన వారందరికీ 'ఉపాధి హామీ' అవకాశం - ఉపాధి హామీ పథకం
పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగి రాష్ట్రానికి చేరుకున్న కూలీలకు ఉపాధి హామీ పనుల్లో అవకాశం కల్పించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కోరారు. మంత్రి ఎర్రబెల్లితో మాట్లాడి కలెక్టర్లకు సూచించారు.
ఉపాధి కోల్పోయిన వాళ్లందరికీ 'ఉపాధి హామీ' అవకాశం
ఉపాది హామీ పథకానికి సంబంధించిన కార్డ్ లేనివారికి కొత్తవి అందజేయాలని, పాతవి రెన్యువల్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ వాటర్ హార్వెస్టింగ్లోనూ కూలీలకు ఉపాధి కల్పించాలని తెలిపారు. వలస వెళ్లి ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామాలకు చేరిన వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలే ఉన్నందున తమ దృష్టికి వారు చేసిన అభ్యర్థనలు వచ్చాయన్నారు. వారందరికీ ఉపాధి హామీ పని కల్పించి ఆదుకోవాలని కలెక్టర్లకు సూచించారు.