Errabelli Dayakar Review on Telangana Haritha haram Goals : కొత్త గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్‌డీఓలతో మంత్రి సచివాలయం నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. హరితహారంలో లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలని సూచించారు.
Telangana Haritha haram Goals :దశాబ్ది సంపద వనాలు, హార్టికల్చర్ ప్లాంటేషన్ల పనులలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి, కింది స్థాయి అధికారులు, ఉద్యోగులను అప్రమత్తం చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని గ్రామాలను కడిగిన ముత్యంలా చేశారన్న దయాకర్ రావు.. నూతనంగా నిర్మిస్తున్న 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Telangana Haritha haram Goals 2023 : హరితహారంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు 6కోట్ల 70 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటి వరకు 2కోట్ల 25 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి ఎర్రబెల్లితెలిపారు. మిగతా మొక్కలను కూడా త్వరగా నాటాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు ఏర్పాటు చేయాలని, హార్టికల్చర్ ప్లాంటేషన్‌ను 50 వేల చోట్ల చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.