తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాస్క్ పెట్టుకోండి.. ఆహార ప్యాకెట్​ పొందండి'

మాస్క్ పెట్టుకోండి ఉచితంగా మజ్జిగా, మంచి నీటి బాటిల్, ఆహార ప్యాకెట్ పొందండి అంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. హైదరాబాద్‌ ఈఎన్​టీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో లక్ష మాస్కుల పంపిణీ కార్యక్రమం ఎంజీబీఎస్​ బస్టాండ్​, కింగ్‌ కోఠి, నాంపల్లి ప్రాంతాల్లో కొనసాగింది.

ent research foundation, distribute one lakh masks
'మాస్క్ పెట్టుకోండి.. ఆహార ప్యాకెట్​ పొందండి'

By

Published : May 5, 2021, 12:09 PM IST

హైదరాబాద్‌ ఈఎన్​టీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష మాస్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నగరంలోని ఎంజీబీఎస్​ బస్టాండ్​, కింగ్‌ కోఠి, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జీవీఎస్‌ రావు మాస్కులు వితరణ చేశారు.

మాస్క్‌ పెట్టుకోండి ఉచితంగా మజ్జిగ, ఆహారం పొందండి అంటూ వినూత్నంగా అవగాహన కల్పించారు. మాస్కులు ధరించటం వల్ల వైరస్‌ సోకే ప్రమాదం తక్కువగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించకుంటే 90 శాతం కొవిడ్ బారిన పడటానికి అవకాశం ఉందని తెలిపారు.

'మాస్క్ పెట్టుకోండి.. ఆహార ప్యాకెట్​ పొందండి'

ఇదీ చూడండి: సూది మందు పంపుతామని.. చుక్కలు చూపుతున్నారు

ABOUT THE AUTHOR

...view details