తెలంగాణ

telangana

ETV Bharat / state

మా కాలేజీలు మూసుకుంటాం..! - colleges

ఏటా వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతూ నానా తిప్పలు పడుతున్న ఇంజినీరింగ్ కళాశాలలు మూసేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ జేఎన్​టీయూ​కు దరఖాస్తులు చేసుకుంటున్నాయి.

jntuh

By

Published : Feb 5, 2019, 9:25 AM IST

Updated : Feb 5, 2019, 2:12 PM IST

jantu
ఇంజినీరింగ్ కళాశాలలను మూసేందుకు సిద్ధమయ్యాయి. సీట్లు భర్తీ కాకపోవడం వల్ల మూసివేతకు అనుమతి ఇవ్వాలని 8కాలేజీల యాజమాన్యాలు జేఎన్​టీయూహెచ్​కు దరఖాస్తు చేశాయి. కోర్సులు, సీట్లు తగ్గించుకునేందుకు ఈ నెల 8 వరకు దరఖాస్తు గడువుంది. ఇప్పటికే 8 అభ్యర్థనలు అందాయి. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని రిజిస్ట్రార్ ఆచార్య యాదయ్య తెలిపారు. రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరానికి 17 ప్రభుత్వ, 188 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతులు లభించాయి. ప్రైవేటు ఓయూ పరిధిలో 10, కాకతీయ వర్సిటీలో 5 కళాశాలలున్నాయి. జేఎన్​టీయూ హైదరాబాద్​కు అనుబంధంగా 173 కాలేజీ​లు ఉన్నాయి. వీటిలో 96,518 బీటెక్ సీట్లు ఉండగా.. 68,296 మాత్రమే భర్తీ అయ్యాయి.
Last Updated : Feb 5, 2019, 2:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details