Engineering colleges bouncers news: రాష్ట్రంలోని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు బౌన్సర్లను నియమించుకుంటున్నాయి. ఏడాదిన్నరగా పలు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఫలితంగా వారు నిత్యం కళాశాలల వద్దకు వచ్చి యాజమాన్యాలను నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల అప్పటికప్పుడు ధర్నాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో కొన్ని కళాశాలలు ప్రైవేట్ సెక్యూరిటీ పేరిట బౌన్సర్లను నియమించుకుంటున్నాయి. హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ ప్రాంతంలో ఓ కళాశాల యాజమాన్యం పలువురిని ఇలాగే ఏర్పాటు చేసుకుంది. జీతాలు ఇవ్వాలని వెళితే తమను లోపలికి పంపకుండా వారు అడ్డుకుంటున్నారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. ‘కనీసం కరోనా కంటే ముందు పనిచేసిన కాలానికి కూడా జీతాలు ఇవ్వరా’ అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ కళాశాలలో మూడొంతుల మంది అద్దె అధ్యాపకులే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని మరో కళాశాలలో తరచూ విద్యార్థుల మధ్య ఘర్షణలు జరుగుతుండంటంతో ఆ సంస్థ కూడా బౌన్సర్లను నియమించుకుంది.
Engineering colleges bouncers news: జీతాల కోసం వచ్చే అధ్యాపకులను అడ్డుకోవడానికి బౌన్సర్లు!
Engineering colleges bouncers news:రాష్ట్రంలోని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు బౌన్సర్లను నియమించుకుంటున్నాయి. అదేదో అల్లర్లు చేసే వారిని అదుపు చేయడం కోసం కాదు.. జీతాల కోసం వచ్చే అధ్యాపకులను అడ్డుకోవడానికి నియమించుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ ప్రాంతంలో ఓ కళాశాల యాజమాన్యం పలువురిని ఇలాగే ఏర్పాటు చేసుకుంది. జీతాలు ఇవ్వాలని వెళితే తమను లోపలికి పంపకుండా వారు అడ్డుకుంటున్నారని అధ్యాపకులు(engineering colleges faculty) ఆరోపిస్తున్నారు.
అధ్యాపకులు వేతనాల కోసం డిమాండ్ చేస్తూ కళాశాలల వద్ద ధర్నాలకు దిగుతున్నా జేఎన్‌టీయూహెచ్ అధికారులు స్పందించడం లేదు. తాము ఫిర్యాదు చేసినా ఒకటిరెండు రోజులు హడావిడి చేస్తున్నారు తప్ప వేతనాలను ఇప్పించడం లేదని అధ్యాపకులు విమర్శిస్తున్నారు. పనిచేసినందుకు జీతాలు అడిగితే బౌన్సర్లతో బయటకు గెంటిస్తున్నారని, పోలీసు కేసులు పెట్టిస్తున్నారని తెలంగాణ పాఠశాలలు, సాంకేతిక కళాశాలల ఉద్యోగుల సంఘం(TSTCEA) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ చెప్పారు. వేతనాలు ఇవ్వని కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్ ఎలా అనుబంధ గుర్తింపు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి:TS Cabinet: యాసంగి సాగే ప్రధాన అజెండాగా ఇవాళ కేబినెట్ సమావేశం