టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం కేసు నమోదు చేసింది. రవిప్రకాశ్, మరో ఇద్దరు టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి 2018 సెప్టెంబర్- 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2019 అక్టోబర్‌లో కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈడీ వర్గాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేశాయి.
రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు - టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై కేసు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం కేసు నమోదు చేసింది. టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనుమతుల్లేకుండా నిధులు ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు