AP Employees Union on Protest: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని ఎన్జీవో కార్యాలయంలో ఏపీ ఐకాస, అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లినట్లు ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. కానీ.. ఇప్పటి వరకూ ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Employees Union: రేపటి నుంచే ఉద్యోగుల ఉద్యమం - ఉద్యోగ సంఘాల ధర్నా
Employees Union Latest Protest : ఏపీ ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లినా.. ఇప్పటి వరకూ పీఆర్సీ నివేదిక ఇవ్వలేదని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. ఈక్రమంలో మంగళవారం నుంచే తమ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగుల ఉద్యమం
అందుకే.. రేపటి నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్న ఆయన.. ప్రాంతీయ సదస్సులను జయప్రదం చేయాలని కోరారు.
ఇదీ చూడండి:యువతిపై ఫ్యాక్టరీ మేనేజర్ కర్కశం- నొప్పితో ఏడుస్తున్నా..