ETV Bharat / state
శిక్షణకు హాజరు కానివారిపై చర్యలు: దానకిషోర్
ఎన్నికలు సజావుగా నిర్వహించే బాధ్యత సెక్టోరియల్ అధికారులపై ఉందని... వీరికి మెజిస్టేరియల్ అధికారాలు ఇవ్వనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ఎన్నికల సెక్టోరియల్ అధికారులతో ప్రధాన కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
రెండో విడత శిక్షణ కార్యక్రమాలపై దానకిశోర్
By
Published : Mar 30, 2019, 5:38 AM IST
| Updated : Mar 30, 2019, 8:06 AM IST
రెండో విడత శిక్షణ కార్యక్రమాలపై దానకిశోర్ లోక్‌సభ ఎన్నికల సిబ్బందికి రేపటి నుంచి మూడు రోజుల పాటు 15 కేంద్రాల్లో రెండో విడత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ మిషన్లు మొరాయిస్తే అరగంటలోపు వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సెక్టోరియల్ అధికారులదేనని అన్నారు. రెండో విడత శిక్షణకు రానివారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తగు చర్యలు చేపడతామని దానకిషోర్ హెచ్చరించారు. Last Updated : Mar 30, 2019, 8:06 AM IST