CEC Arrangements for Conducting Elections with IT Software Help: ఐటీ సాంకేతికతతో కూడిన పలు సాఫ్ట్వేర్ల సహకారంతో తెలంగాణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దీని వల్ల ఎన్నికలను మరింత పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన వేళ ఈ ఎన్నికలలో ఏఏ సాఫ్ట్వేర్లు వాడనున్నారు.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..
National Grievance Services (NGS) Portal : ఓటర్ల జాబితా, ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం నేషనల్ గ్రీవియెన్సెస్ సర్వీసెస్(ఎన్జీఎస్) పోర్టల్ వినియోగించనున్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన అనుమతులు, అఫిడవిట్లు, పోలింగ్ శాతం నమోదు, పోటీ చేసే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, స్క్రూటినీ నివేదిక తదితరాల కోసం ఎన్కోర్ వెబ్సైట్ను ఉపయోగించనున్నారు.
cVIGIL App : సీవిజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికై సీవిజిల్ వెబ్సైట్ను వినియోగించనున్నారు. ఈ యాప్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను వివిధ వ్యక్తుల నుండి స్వీకరిస్తారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే అటువంటి వారిపై ఫిర్యాదులను ఈ యాప్ ద్వారా చేయవచ్చు.
ETPBS : సర్వీసు ఓటర్లు తమ ఓట్లను ఎలక్ట్రానిక్ విధానంలో వినియోగించుకునేలాఈ-పోస్టల్ బ్యాలెట్కోసం ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం(ఈటీపీబీఎస్) ను వినియోగిస్తారు. సర్వీస్ ఓటర్ల దరఖాస్తుల పరిశీలన వివరాల నమోదు, తదితరాల కోసం సర్వీస్ ఓటర్స్ పోర్టల్ ఉపయోగిస్తారు.