నగర వాసుల విజ్ఞప్తి మేరకు చార్మినార్ వద్ద నెలలో రెండు ఆదివారాలు 'ఏక్ శామ్ చార్మినార్ కె నామ్ (Ek Shaam Charminar ke Naam)' నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాని (Ek Shaam Charminar ke Naam)కి సందర్శకులనుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఆదివారం వేళ చార్మినార్ నుంచి మదీన కూడలి వరకూ సందర్శకులతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. కుటుంబాలతో సహా చిన్నా, పెద్దా అందరూ కలిసి చార్మినార్ (Ek Shaam Charminar ke Naam) వద్ద సందడి చేస్తున్నారు.
ఈ కార్యక్రమం (Ek Shaam Charminar ke Naam)లో భాగంగా చారిత్రాత్మక కట్టడాన్ని తివర్ణ పతాక రంగులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. నోటితో చేసే సంగీత ధ్వనులు, కవ్వాలి ఆకట్టుకున్నాయి. చార్మినార్ నుంచి మక్కా మసీద్ వెళ్లే దారిలో ప్రత్యేక ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. పత్తర్ కా గోష్, కబాబ్స్, హలీం, బిర్యాని వంటి పాత బస్తీ రుచులు నగర వాసులను ఆకర్షించాయి. అత్తరులు, దుస్తులు, గాజులు, బొమ్మల కొనుగోలుపై సందర్శకులు ఆసక్తి కనబరిచారు. సందర్శకుల భద్రత దృష్ట్యా అధికారులు పెద్దఎత్తున పోలీసులను చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మొహరించారు.
ఇదీ చూడండి:Ek Shaam Charminar ke Naam: "ఏక్ శామ్ చార్మినార్ కె నామ్" గ్రాండ్ సక్సెస్..
EK SHAM CHARMINAR KE NAAM: సందడికి వేళైంది.. 'ఏక్ షామ్ చార్మినార్ కే నామ్' మొదలైంది.!