పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యారంగ నాయకులుగా తయారు చేసేందుకు "ఎక్స్‌ప్లో ఎడ్యుకేషన్ 2019" పేరుతో ప్రజాస్వామ్య పీఠం(ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్- ఎఫ్డీఆర్) తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు విద్యాయాత్రను నిర్వహించనుంది. ఈనెల 25న చిత్తూరు జిల్లా మదనపల్లి వద్దనున్న రిషీర్యాలీ స్కూల్లో లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డా.జయప్రకాశ్ నారాయణ ప్రారంభిస్తారు. ఈమేరకు లోక్‌సత్తా ఒక ప్రకటనలో పేర్కొంది. 25న రిషీ వ్యాలీ స్కూల్ అనంతరం 26, 27న విజయవాడ, 28న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి, 29న హైదరాబాద్‌లోని పాఠశాలల్లో ఈ బృందం సందర్శిస్తుంది. 30న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి పబ్లిక్స్కూల్లో ముగింపు సమావేశాన్ని నిర్వహించి, బృందాలు తమ నివేదికను సమర్పిస్తాయి.
నేటినుంచి తెలుగు రాష్ట్రాల్లో విద్యా పరిరక్షణ యాత్ర
విద్యారంగ పరిరక్షణకు లోక్‌సత్తా అధినేత డా.జయప్రకాశ్ నారాయణ కసరత్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో యాత్ర ద్వారా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు.
డా.జయప్రకాశ్ నారాయణ