వ్యవస్థాపక యూనిట్లను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం దేశంలో 7వ ఆర్థిక గణన సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్ర గణాంక విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో అర్థశాస్త్ర విభాగం, ఇతర శాఖలు ఈ సర్వేను సెప్టెంబరు 1 నుంచి నిర్వహించనున్నాయి. జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో పలువురికి శిక్షణ ఇచ్చారు. తొలిసారిగా సర్వేను కాగిత రహితంగా, యాప్ ద్వారా నిర్వహిస్తున్నట్లు కేంద్ర గణాంక విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సతీష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,506 మంది ఎన్యుమరేటర్లను, 4,472 మంది సూపర్‌వైజర్లను పోర్టల్‌లో నమోదు చేశామని చెప్పారు. వారికి జిల్లా, మండలస్థాయిలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక గణన విభాగం డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, సీఎస్‌సీ రాష్ట్ర ఇంఛార్జ్ రాజా కిశోర్ పాల్గొన్నారు.
కాగిత రహిత భారత 7 వ ఆర్థిక గణన సర్వే - జూబ్లీహిల్స్
వ్యవస్థాపక యూనిట్లను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం 7వ ఆర్థిక గణన సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ సర్వేని నిర్వహించనున్నారు. దీనికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి శిక్షణ ఇస్తున్నారు. మొదటిసారిగా కాగిత రహితంగా నిర్వహిస్తున్నారు.
కాగిత రహిత భారత 7 వ ఆర్థిక గణన సర్వే